ప్రజారోగ్యానికి పార్కులు చిరునామా,ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.
అమీన్‌పూర్,జూన్,26,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.పార్కులు ప్రజల ఆరోగ్యానికి, భవిష్యత్ తరాల ఆనందానికి చిరునామాగా నిలుస్తాయని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ కాలనీ, హెచ్ఎంటీ శిల్ప లేఔట్ కాలనీ మరియు పీఎన్ఆర్ కాలనీల్లో సుమారు రూ. 1.51 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పటాన్‌చెరు నియోజకవర్గంలోని తొమ్మిది డివిజన్లలో ఉన్న ప్రతి పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. పార్కుల...