MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 2:51 am Digital Edition : Shiva Kumar

ప్రజారోగ్యానికి పార్కులు చిరునామా,ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

అమీన్‌పూర్,జూన్,26,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.పార్కులు ప్రజల ఆరోగ్యానికి, భవిష్యత్ తరాల ఆనందానికి చిరునామాగా నిలుస్తాయని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ కాలనీ, హెచ్ఎంటీ శిల్ప లేఔట్ కాలనీ మరియు పీఎన్ఆర్ కాలనీల్లో సుమారు రూ. 1.51 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పటాన్‌చెరు నియోజకవర్గంలోని తొమ్మిది డివిజన్లలో ఉన్న ప్రతి పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. పార్కుల అభివృద్ధి వల్ల స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణం లభించడమే కాకుండా, కాలనీల్లో పచ్చదనం పెరిగి స్వచ్ఛమైన గాలి అందుతుందని తెలిపారు. ప్రతి పార్కులోనూ పిల్లల కోసం ఆట వస్తువులను ఏర్పాటు చేయడంతో పాటు, వాకింగ్ ట్రాక్ పనులను కూడా చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇంజనీరింగ్ అధికారి సురేష్, డీఈ వెంకటరమణ, పార్కుల విభాగం మేనేజర్ సతీష్ మరియు మాజీ కౌన్సిలర్లు కృష్ణ, బిజిలి రాజు, మహదేవ రెడ్డి, మాజీ కోఆప్షన్ నెంబర్ రాములు, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉపేందర్ రెడ్డి, కొల్లూరి గోపాల్, కాట సునీత, జగదీష్,కొల్లూరు యాదగిరి, మహిపాల్ రెడ్డి, పిఎన్ఆర్ కాలనీ ప్రెసిడెంట్ గిరీష్, సెక్రటరీ హరీష్, జాయింట్ సెక్రెటరీ, సంతోష్, ట్రెజరర్, అశోక్ మెంబర్స్ వెంకట్, సాంబశివరావు, ఆనంద్, కాలనీ వాసులు పెద్ద పాల్గొన్నారు.