📄 ePaper
Wednesday, March 11, 2026
ADS
Homehealth hospitalప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ కలెక్టర్, ‌పాపన్నపేట మండల కేంద్రంలోనిపీ.హెచ్.సీ...

ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ కలెక్టర్, ‌పాపన్నపేట మండల కేంద్రంలోనిపీ.హెచ్.సీ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..

📰 Generate e-Paper Clip

పాపన్నపేట డిసెంబర్ 26 మెదక్ టుడే న్యూస్:  ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ కలెక్టర్, ‌పాపన్నపేట మండల కేంద్రంలోనిపీ.హెచ్.సీ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్,ఆసుపత్రి లోని అన్ని విభాగాల పరిశీలన,మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,పాపన్నపేట మండలం పీ.హెచ్.సీ ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్ సీ లోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు.ప్రతి రోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.ఈ నెలలో ఎన్ని డెలివరీల లక్ష్యం ఉందని, ఇప్పటిదాకా ఎన్ని చేశారని సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృశ్య సారించాలని లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడారు.
ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని జిల్లాలో ఆరోగ్య సేవలు మరింత మెరుగుపడినాయని తెలిపారు. హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత , పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు.ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments