MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 1:51 am Digital Edition : SHIVA KUMAR

ప్రజలకు నీటి సమస్య రాకుండా చూడాలి డిపిఓ యాదయ్య,

చేగుంట,ఏప్రిల్,24,మెదక్ టుడే న్యూస్:ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని చేగుంట మండల కేంద్రంలో స్థానిక గ్రామపంచాయతీలో సర్పంచ్ స్రవంతి సతీష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు, గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు చేయవలసిన అభివృద్ధి పనులపై చర్చించి ఏయే వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో గ్రామ సభలో చర్చించి వాటిని చేసే విధంగా ప్రణాళిక తయారు చేసుకున్నారు ఈ గ్రామ సభకు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య హాజరై గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పంచాయతీ ఈఓ ద్వారా అడిగి తెలుసుకున్నారు,
గ్రామంలో నీటి సమస్యను ఎక్కడెక్కడ తీర్చారు మ్యాప్ ఆధారంగా ఈవో జిల్లా పంచాయతీ అధికారికి సూచించడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని, వేసవికాలం దృష్టిలో పెట్టుకొని ప్రధానమైనటువంటి సమస్య మంచినీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆ సమస్య రాకుండా చూసుకోవాలని తెలిపారు, పంచాయతీ పాలకవర్గం సమిష్టిగా పనిచేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్నారని ఇదేవిధంగా పాలకవర్గం అంతా కలిసి ఉంటూ గ్రామాన్ని అని రంగాలలో అభివృద్ధి పరచాలని ఆయన తెలిపారు గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాలు గాని రికార్డుల పరంగా గాని సమస్యల పరిష్కారంలో గాని పాలకవర్గం సమిష్టిగా పనిచేయడం జరుగుతుందని, రాబోయే రోజులు కూడా పాలకవర్గం ఇదే సమిష్టిగా పనిచేస్తూ ఉత్తమ గ్రామ పంచాయతీ ఎంపికయ్య విధంగా వారి పనితనంలో కనిపిస్తుందని ఆయన తెలిపారు, నేటి సమస్య తీర్చేందుకు పాత బోర్లను బ్లెస్సింగ్ చేయిస్తూ అవసరమైతే నూతన బోర్లు వేసి మంచినీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆ సమస్య రాకుండా చూసుకోవాలని తెలిపారు, పంచాయతీ ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి సతీష్ ఉప సర్పంచ్ మహ్మద్ రఫీ తోపాడు పాలకవర్గ సభ్యులు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు