ప్రజల ప్రాణాలతో చెలగాటం…శిథిలావస్థలో పాపన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి.!
-శిథిలావస్థలో పాపన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి.! -కూలిపోతుందేమోనన్న భయంతో రోగులు. -ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది. కొత్త భవనం, నిర్మించాలంటూ ప్రజలు విజ్ఞప్తి. పాపన్నపేట,జూలై,8,మెదక్ టుడే న్యూస్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన పాపన్నపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ సి ) ప్రస్తుతం శిథిలావస్థలోకి చేరి ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు ఏ క్షణంలో పైకప్పు పెచ్చులు ఊడిపడి ప్రమాదం సంభవిస్తుందోనన్న భయంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.ఆసుపత్రి భవనం గోడలన్నీ పగుళ్లతో...