ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ చర్యలు మెదక్ జిల్లా ఎస్పీ.

పారదర్శకంగా విచారణ చేపట్టాలి: మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు మెదక్,జూలై,20,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి ఒక్కో అర్జీని పరిశీలించారు.జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వ్యక్తిగత, సామాజిక, భూ వివాదాలు,...