చేగుంట,ఏప్రిల్,16,మెదక్ టుడే న్యూస్:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా నేడు మండల స్థాయి సమావేశం చేగుంట రైతు వేదిక లో నిర్వహించారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చిన్నారెడ్డి అధ్యక్షతన మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు వివిధ గ్రామాల సర్పంచులు మరియు ఉప సర్పంచ్లు, రైతులు, గ్రామైక్య సంఘాల అధ్యక్షురాలు, యువజన సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు, ఇట్టి సమావేశంలో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ మూడు విడుతల రైతు భరోసా ఈ యాసంగి 11575 రైతులకు రైతు భరోసా రైతు బీమా 58 మందికి రాను 5 లక్షల రూపాయలు చొప్పున నామినీకి 1,45,00000 లక్షలు 2024-25 లో 54 మందికి రైతు బీమా 2.74 పంట రుణమాఫీ కూడా చేయడం జరిగిందన్నారు, వ్యవసాయ యాంత్రీకరణ సామాగ్రి సబ్సిడీపై కల్టివేటర్స్ వారికి 2 64 985 ఇవ్వడం జరిగిందని సంబంధిత అధికారి తెలిపారు.హౌసింగ్ ఏఈ మాట్లాడుతూ మండలంలోని మండలంలోని 612 ఇండ్లు మంజూరు అయ్యాయని 454 బేస్మెంట్ పూర్తి అయినాయి 550 మార్క్ అవుట్ అయినాయి అని 31 ఇల్లు పూర్తి అయ్యాయని వీటికి చెల్లించిన తొమ్మిది కోట్ల 81 లక్ష వారికి ఇవ్వడం జరిగింది.తహసిల్దార్ శివప్రసాద్ మాట్లాడుతూ,నూతన రేషన్ కార్డులు 1436 అడిషనల్ గా 5429 2025 26 నందు కళ్యాణ లక్ష్మికి 354 మందికి 34,43,990 చెల్లించినదని తెలిపినారు.
విద్యుత్ శాఖ అధికారి మాట్లాడుతూ గృహజ్యోతి కింద 6999 మీటర్లకు గాను జీరో బిల్లుకు ప్రభుత్వం ద్వారా కోటి 92 లక్షల రూపాయలు జమ చేయడం జరుగుతున్నదని తెలియ చేశారు.పంచాయతీ అధికారి మాట్లాడుతూ మన మండలంలో చేయూత పెన్షన్ల కింద మొత్తము 6900 పెన్షన్లు మరియు కొత్త పెన్షన్లు 180 మంది లబ్ధిదారులకు ఇవ్వనైనదని తెలియజేశారు, మరియు వికలాంగుల కోట కింద ఇద్దరు లబ్ధిదారులకు 50 వేల చొప్పున ఉపాధి నిమిత్తం వడియారం మరియు రెడ్డి పల్లి వారికి మంజూరు చేయడమైనదని తెలిపినారు.
ఐకెపి ఏపిఎం గుర్గాప్రసాద్ మాట్లాడుతూ మూడు రకాల సేవలలో బ్యాంకు లింకేజీ ద్వారా 558 సంఘాలకు రుణాలు అందిచడం జరిగిందని వడ్డీ లేని రుణాలు 736 సంఘాలకు ఒక కోటి 38 లక్షల 88000 తిరిగి వచ్చాయని, మరియు 13,834 చీరలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మరియు ప్రభుత్వం నుండి ఆర్టిసి బస్సు మరియు గోడౌన్ మంజూరు చేయడం జరిగింది అని తెలియజేశారు.పోలీస్ శాఖ అధికారి మాట్లాడుతూ రోడ్డు భద్రత కమిటీలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందని . యాక్సిడెంట్లు నివారించుటకు ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ను ధరించాలని, మరియు మద్యం సేవించి బళ్ళు నడపద్దని చిన్న పిల్లలకు బైకులు ఇవ్వద్దని సంబంధిత అధికారులు తెలిపినారు.విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ కాంట్రాక్టు ద్వారా 1380,2008 అభ్యర్థులను నియమించడం జరిగిందని తెలిపారు, మరియు 4454 మందికి పదోన్నతి ఇవ్వడం జరిగిందని 34706 మంది ఉపాధ్యాయులను బదిలీ చేయడం జరిగిందని, టెట్ పాస్ కాని వారు అందరూ కూడా బి.ఎడ్ మరియు డీఎడ్ ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్ నిర్వహించబడుతుందని ఉపాధ్యాయులు పరీక్షలు రాస్తున్నారని మరియు వేసవి సెలవులలో 1,12,822 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు.
మహాత్మా గాంధీ ఉపాధి పథకం ద్వారా సంబంధిత అధికారి మాట్లాడుతూ మండలంలోని జాబ్ కార్డులు 9554, కూలీలు 17915, 2024 25 లో పని దినములు 2,54,519 మరియు 2025 26 లో 14476 పని దినములు 2024 25 లో 49 క్యాటిల్ షెడ్లు 2025 26 లో భాగంగా 26 క్యాటిల్ షెడ్ లు పూర్తి చేసినట్లు తెలిపారు, మండలంలో 13 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు మరియు ఎంపీడీవో మాట్లాడుతూ 40 మందికి ఒక మేట్ ఉండాలని తెలియజేశారు.మిషన్ భగీరథ ఏఈ మాట్లాడుతూ మండలంలోని 10274 కనెక్షన్లు ఉన్నాయని 78 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు మరియు 58 త్రీఫేస్ మోటర్లు నడుస్తున్నాయని ట్యాంకులలో ఉన్న మెట్లు రిపేరు చేయించాలని తెలియజేశారు.
ఇరిగేషన్ ఏఈ గారు మాట్లాడుతూ చెరువులను జాగ్రత్తగా చూసుకోవాలని చేగుంట మరియు వడియారం చెరువులు పొల్యూట్ అవుతున్నదని చెరువులలో ఎఫ్టిఎల్ బౌండరీలు చేపిస్తామని తెలియజేశారు పశువులకు పక్షులకు ఇబ్బంది కాకుండా చెరువులను చూసుకోవాలని సుప్రీంకోర్టు ద్వారా ఇచ్చిన ఆదేశాలను పాటించాలని తెలిపినారు.పంచాయతీరాజ్ శాఖ అధికారి మాట్లాడుతూ, సి ఆర్ ఆర్ ద్వారా బీటీ రోడ్డుకు ఒక కోటి 90 లక్షలు ఎస్ బి ఎం ద్వారా సోక్ పిట్లకు 16 వేల చొప్పున మరియు ఈజీఎస్ ద్వారా మూడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లకు 60 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని తెలియజేశారు.
ఐ సి డి ఎస్ అధికారి మాట్లాడుతూ గర్భవతులు 2410
బాలింతలు 946 మరియు బాలామృతం ఇవ్వడము జరుగుతుందని తెలియజేశారు. ప్రీ స్కూల్లో భాగంగా నూతన సిలబస్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు ప్రొటెక్షన్ కమిటీ ద్వారా యూనిఫామ్స్ అందించడం జరిగిందని అంగన్వాడీ టీచర్లకు త్వరలో మొబైల్స్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. పశు సంవర్ధన శాఖ అధికారి గారు మాట్లాడుతూ 884 పశువులకు వ్యాక్సినేషన్ మరియు 1603 పశువులకు గాను ట్రీట్మెంట్ చేయడం జరిగిందని తెలిపినారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అనిల్ మాట్లాడుతూ గర్భవతులను ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లకుండా ప్రభుత్వాసుపత్రిలో నార్మల్ డెలివరీ చేయించాలని తెలియజేశారు, పుట్టిన బిడ్డకు ఇమ్యునైజేషన్ వ్యాధులు రాకుండా టీకాలు వేస్తున్నామని 15 సంవత్సరాలలోపు హెచ్పీవీ వ్యాక్సిన్ ఆడపిల్లలకు ఇవ్వడం జరుగుతుందని, వేసవిలో బయటకు వెళ్లే వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉపయోగించాలని అందుబాటులో ఉన్నాయని 9 నుంచి 4 వరకు డ్యూటీలో ఉంటామని,నాలుగు నుండి ఐదు వేలకు ఒక సబ్ సెంటర్ ఉంటదని ఆశ వర్కర్ల ద్వారా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు.సోమల తండా సర్పంచ్ మాట్లాడుతూ డ్రైనేజ్ ఇబ్బంది ఉన్నదని ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. రెడ్డిపల్లి సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో కరెంటు సమస్య తీరంలో ఉన్నదని ఆ సమస్యను పరిష్కరించాలని ఆయన అధికారులకు తెలియజేశారు.
