పోలీస్ కిష్టయ్య త్యాగం మరువలేనిది: నీలం మధు ముదిరాజ్..ఘనంగా కిష్టయ్య వర్ధంతి..

పటాన్చెరు డిసెంబర్ 01మెదక్ టుడేన్యూస్ ప్రతినిధి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన పోలిస్ కిష్టయ్య త్యాగం మరువలేనిదని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ కొనియాడారు.సోమవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ ఎన్ఎంఆర్ కార్యాలయంలో పోలీస్ కిష్టయ్య వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కిష్టయ్య చిత్రపటానికి నీలం మధు ముదిరాజ్ పూలమాలలు వేసి ఘన నివాళులను అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు...