MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 4:54 am Digital Edition : Medak Today

పోలీస్ కిష్టయ్య త్యాగం మరువలేనిది: నీలం మధు ముదిరాజ్..ఘనంగా కిష్టయ్య వర్ధంతి..

పటాన్చెరు డిసెంబర్ 01
మెదక్ టుడేన్యూస్ ప్రతినిధి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన పోలిస్ కిష్టయ్య త్యాగం మరువలేనిదని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ కొనియాడారు.సోమవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ ఎన్ఎంఆర్ కార్యాలయంలో పోలీస్ కిష్టయ్య వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కిష్టయ్య చిత్రపటానికి నీలం మధు ముదిరాజ్ పూలమాలలు వేసి ఘన నివాళులను అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా తనని తాను కాల్చుకుని ప్రాణాలు అర్పించిన వీరుడు కిష్టయ్యేనని ఆయన అన్నారు. పోలీస్ కిష్టయ్య త్యాగాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువలేరని, వారి గుండెల్లో చిరస్మరణియుడిగా చెదరని ముద్ర వేసుకున్నారని ఆయన అన్నారు. కిష్టయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆశయాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందన్నారు..