పోచారం మల్లన్న జాతరలో కార్పొరేటర్ మెట్టు కుమార్,బి ఆర్ ఎస్ నాయకుడు మాణిక్ యాదవ్.

పటాన్‌చెరు,జనవరి,5,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.పటాన్‌చెరు నియోజవర్గం పరిధిలోని ముత్తంగి డివిజన్ పోచారం గ్రామంలో వెలిసిన మల్లన్న స్వామి జాతర మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఆలయానికి చేరుకున్న వారికి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు.పూజా కార్యక్రమాల...