MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 4:36 am Digital Edition : Medak Today

పోచారం మల్లన్న జాతరలో కార్పొరేటర్ మెట్టు కుమార్,బి ఆర్ ఎస్ నాయకుడు మాణిక్ యాదవ్.

పటాన్‌చెరు,జనవరి,5,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.పటాన్‌చెరు నియోజవర్గం పరిధిలోని ముత్తంగి డివిజన్ పోచారం గ్రామంలో వెలిసిన మల్లన్న స్వామి జాతర మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఆలయానికి చేరుకున్న వారికి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు.పూజా కార్యక్రమాల అనంతరం జాతర ప్రాంగణమంతా కలియతిరుగుతూ భక్తులతో కలిసి మెట్టు కుమార్, మాణిక్ యాదవ్ సందడి చేశారు. గ్రామ ప్రజలతో స్నేహపూర్వకంగా ముచ్చటించి, వారి యోగక్షేమాలను, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాతరను ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఈ సందర్భంగా వారు అభినందించారు.భక్తులకు జాతర శుభాకాంక్షలు తెలుపుతూ.. మల్లన్న స్వామి కృపాకటాక్షాలతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీశైలం యాదవ్, పోచారం మాజీ సర్పంచ్, జగన్, పోచారం మాజీ సర్పంచ్ బిక్షపతి,స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.