పీజేఆర్ కాలనీలో శివలింగ ప్రతిష్ఠాపనోత్సవం: హాజరైన నల రవీందర్ రెడ్డి, మన్నే రవీందర్, ఎర్రోళ్ల పాండు.
అమీన్‌పూర్,ఆగస్టు,27,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని పీజేఆర్ కాలనీలో శ్రీ బ్రహ్మ సూత్ర మరకత శివలింగం, నవగ్రహాలు మరియు నాగదేవత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మాజీ కౌన్సిలర్ కొత్తపల్లి మహాదేవ్ రెడ్డి ఆధ్వర్యంలో, కాలనీవాసుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ వార్డు మెంబర్ నల రవీందర్ రెడ్డి, ప్రముఖ నాయకులు మన్నే రవీందర్, ఎర్రోళ్ల పాండు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులను మాజీ కౌన్సిలర్ కొత్తపల్లి మహాదేవ్ రెడ్డి...