చేగుంట,మార్చ్,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల ప్రజా పరిషత్,చేగుంట మీటింగ్ హాల్ నందు ” పీఎం స్వానిది ” పై వీధి వ్యాపారులతో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇట్టి సదస్సు యందు వీధి వ్యాపారులకు దశలవారీగా 15000 నుండి 50000 వరకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడం జరుగును, రాబోయే 15 రోజులు ఐకేపీ సిబ్బంది ద్వారా సర్వే చేసి వారి వివరాలను సేకరించడం జరుగుతుందని, ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో మెప్మా పీడీ హనుమంత రెడ్డి, ఎల్ డి ఎం చారి, ఎంపీడీఓ చిన్నారెడ్డి, చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఐకేపీ సిబ్బంది, మహిళలు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

