మాజీ కౌన్సిలర్ మహాదేవ రెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష
50 వేల జనాభా ఉన్న ప్రాంతానికి డివిజన్ ఇవ్వాలి – మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ డిమాండ్.
అమీన్పూర్,జనవరి,31,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ పరిధిలోని పి జె ఆర్ ఎన్‌క్లేవ్‌ను ప్రత్యేక జిహెచ్ఎంసి డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ చేపట్టిన నిరాహార దీక్షకు రాజకీయ మద్దతు లభించింది. శనివారం జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ హాజరై తమ పూర్తి మద్దతును ప్రకటించారు. పి జె ఆర్ ఎన్క్లేవ్ నివాసితులు చేస్తున్న పోరాటం న్యాయమైనదని, దీనికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని తుమ్మల పాండురంగ రెడ్డి మరియు నందారం నరసింహ గౌడ్ తెలిపారు.హైదరాబాద్ సిటీలోని ఇతర ప్రాంతాల్లో 18 వేల నుండి 20 వేల జనాభా ఉన్న చోట కూడా కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారని, మరి 50 వేల జనాభా ఉన్న పి జె ఆర్ ఎన్‌క్లేవ్‌ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ప్రశ్నించారు.అమీన్పూర్ పరిధిలో సుమారు లక్షా పదిహేను వేల (1.20 లక్షలు) పైగా ఓటింగ్ ఉన్నందున, ప్రజల సౌకర్యార్థం అమీన్పూర్లో మరో రెండు డివిజన్లను పెంచి మొత్తం నాలుగు డివిజన్లు చేయాలని డిమాండ్ చేశారు.పెరుగుతున్న జనాభా మరియు ఓటర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మాజీ కౌన్సిలర్స్ కృష్ణ, ఉపేందర్ రెడ్డి, స్థానిక మాజీ కౌన్సిలర్ కొత్తపల్లి మహాదేవరెడ్డి, పి జె ఆర్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, వేదిరి, అన్ని కాలనీలా వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

