పెద్దశివునూర్ లో కొనసాగుతున్న జనగణన.

పెద్దశివునూర్ లో కొనసాగుతున్న జనగణన. చేగుంట,మే,23,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం పెద్దశివునూర్ గ్రామంలో మొదటి విడత జనగణన దిగ్విజయంగా కొనసాగుతుంది. స్థానిక ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు సంతోషి ఎన్యుమరేటర్లుగా ప్రతిరోజు ఉదయాన్నే గ్రామాన్ని చుట్టేస్తున్నారు.గ్రామ ప్రజల సహకారంతో ఇప్పటికే 70%పైగా జనగనన పూర్తి చేసామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.ఆరంభం నుండి కొన్ని ఇండ్లకు తాళాలు వేసి ఉండటంతో కొంత ఇబ్బంది ఎదురవుతున్నందున ప్రజలు కొన్ని రోజులు ఇంటివద్ద ఎవరినైనా ఉంచినట్లుయితే త్వరగా పూర్తి చేయడానికి వీలుపడుతుందని తెలియజేసారు. కాగా వచ్చే నెల అనగా జూన్ 9వరకు...