•పేదల ప్రజల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి. ఎమ్మెల్యే..
•బాధిత కుటుంబానికి రూ.2,50,000/-ల ఎల్ఓసి కాపీనీ అందజేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్..
•ఆపధకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కు కృతజ్ఞతలు తెలిపిన మస్కారి లక్ష్మయ్య కుటుంబ సభ్యులు..
పాపన్నపేట,నవంబర్,17,మెదక్ టుడే న్యూస్:
మెదక్ లో సోమవారం పాపన్నపేట మండలం పరిధిలోని యూసుఫ్ పేట గ్రామానికి చెందిన మాస్కారి లక్ష్మయ్య అనారోగ్య సమస్యతో బాధపడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసి నుంచి రూ.2,50,000 (2లక్షల 50 వేల రూపాయలు) ఎల్ఓసి కాపీనీ మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ మైనాంపల్లి రోహిత్ ప్రత్యేక చొరతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి లో చికిత్స కోసం మాస్కారి లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు,ఎల్ ఓ సి,కాపీనీ అందజేశారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వైద్య విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటుందని, స్థానిక శాసనసభ్యుడిగా నా దృష్టికి వచ్చిన అనారోగ్య సమస్యల పట్ల నా వంతు సహాయ సహకారం అందించే కృషి చేస్తానని తెలిపారు.నా మెదక్ నియోజకవర్గ ప్రజలందరికి విజ్ఞప్తి లక్షల రూపాయలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆసుపత్రిల దోపిడికి గురై అప్పుల పాలు కావద్దు విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ నిమ్స్ హాస్పిటల్ వెళ్లి నేను ఇచ్చే ఎల్వోసీ ద్వారా ఉచిత చికిత్స పొందాలనీ ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే రోహిత్ రావు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్బంగా మాస్కార్ లక్ష్మయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రో హిత్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి, తమ కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంత్ రెడ్డి, గోవింద నాయక్, శ్రీకాంత్ అప్ప,ఆకుల శ్రీనివాస్,గౌస్,రాజశేఖర్, తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.