పటాన్‌చెరు రాజకీయంలో పెను ప్రకంపనలు: కాంగ్రెస్ ఇన్చార్జిపై సంచలన ఆరోపణలు చేసిన కాట సునీత !

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ తీరుపై బీఆర్ఎస్ నేత కాట సునీత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమీన్‌పూర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో రాజకీయ వేడిని పెంచాయి. అమీన్‌పూర్‌,మే,23,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి, అసలు ఏం జరిగింది? ఆస్తి పంపకాల పేరుతో పిలిపించి, సొంత అన్న రాజేష్ గౌడ్‌ను కాట శ్రీనివాస్ గౌడ్ గల్లా పట్టుకుని కొట్టడం అత్యంత దౌర్జన్యకరమని సునీత మండిపడ్డారు. "అధికారం ఉందన్న అహంకారంతో కన్నతల్లిని, తోడబుట్టిన...