MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 3:20 am Digital Edition : Shiva Kumar

పటాన్‌చెరు రాజకీయంలో పెను ప్రకంపనలు: కాంగ్రెస్ ఇన్చార్జిపై సంచలన ఆరోపణలు చేసిన కాట సునీత !

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ తీరుపై బీఆర్ఎస్ నేత కాట సునీత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమీన్‌పూర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో రాజకీయ వేడిని పెంచాయి.

అమీన్‌పూర్‌,మే,23,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి,

అసలు ఏం జరిగింది?

ఆస్తి పంపకాల పేరుతో పిలిపించి, సొంత అన్న రాజేష్ గౌడ్‌ను కాట శ్రీనివాస్ గౌడ్ గల్లా పట్టుకుని కొట్టడం అత్యంత దౌర్జన్యకరమని సునీత మండిపడ్డారు. “అధికారం ఉందన్న అహంకారంతో కన్నతల్లిని, తోడబుట్టిన అన్నను గౌరవించని వ్యక్తి, ప్రజలను ఎలా గౌరవిస్తారు?” అని ఆమె ప్రశ్నించారు.కాట సునీత సంధించిన సంచలన ప్రశ్నలు:టికెట్ బాగోతం: ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 50 లక్షలు పార్టీకి చెల్లించినట్లు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఆమె బయటపెట్టారు.వంశంపై వివాదం: దర్శన్ గౌడ్ కు రాజేష్ గౌడ్ పుట్టలేదని శ్రీనివాస్ గౌడ్ అనడం ఆయన సంస్కార హీనతకు పరాకాష్ట. దీనిపై కట్ట మైసమ్మ దేవాలయం సాక్షిగా, పసుపు బట్టలతో వచ్చి డీఎన్ఏ పరీక్షకు సిద్ధమా అని ఆమె సవాల్ విసిరారు.దుందుడుకు చర్యలు: రేవంత్ రెడ్డి ఇంటిపై రాళ్లు వేయించడం, మంత్రి కొండా సురేఖ సాక్షిగా ఎంపీ అభ్యర్థి నీలం మధుపై చేయి చేసుకోవడం వంటి ఘటనలే శ్రీనివాస్ గౌడ్ అరాచక రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి.ఆ ఇన్చార్జిని మార్చండి!ఏ అడ్రస్ లో ఉంటారో తెలియని, ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తికి ఇన్చార్జి పదవి ఇవ్వడం వల్ల పార్టీకి నష్టమని సునీత అభిప్రాయపడ్డారు. వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించాలని సీఎంను కోరారు. తన భర్తపై జరిగిన దాడి, తనపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై శేరిలింగంపల్లి ఏసీపీ శ్రీనివాస్ కుమార్‌కు ఫిర్యాదు చేశామని, చట్టపరంగా పోరాడతామని ఆమె స్పష్టం చేశారు.”దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ, ఇలా దౌర్జన్యాలకు పాల్పడటం పిరికిపంద చర్య” అని సునీత ఘాటుగా హెచ్చరించారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, దీనికి పూర్తి బాధ్యత శ్రీనివాస్ గౌడ్ దేనని ఆమె తేల్చి చెప్పారు.