పటాన్‌చెరు నియోజకవర్గంలో ముమ్మరంగా సాగిన మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన.

ఒకేరోజు రూ.84 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రతి మున్సిపాలిటీకి రూ.15 కోట్ల భారీ నిధుల విడుదల పటాన్‌చెరు,మే,19,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి నేడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు వేలాదిగా తరలివచ్చి మంత్రికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం,...