పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపిన తెల్లాపూర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కోటే హరీష్, కే హెచ్ వై యువసేన బృందం
ఎమ్మెల్యే మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలి: కోటే హరీష్ ఆకాంక్ష
పటాన్ చెరు మే,19,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి:పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి – శ్రీమతి యాదమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెల్లాపూర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కోటే హరీష్ మరియు కే హెచ్ వై యువసేన ప్రతినిధుల బృందం ఎమ్మెల్యే నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే దంపతులకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి వివాహ వార్షికోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా తెల్లాపూర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కోటే హరీష్ మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గంలో ఆయన అందించిన సేవలు ఎనలేనివని, ప్రజా సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపనను ప్రజలు ఎన్నటికీ మరవరని పేర్కొన్నారు. భగవంతుని ఆశీస్సులతో ఎమ్మెల్యే దంపతులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజాదరణ కలిగిన నాయకుడు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు భవిష్యత్తులో రాజకీయంగా మరిన్ని ఉన్నతమైన స్థానాలను, ఉన్నతమైన పదవులను అధిరోహించాలని వారు మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో కోటే హరీష్‌తో పాటు కే హెచ్ వై యువసేన బృందం సభ్యులు, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
