పాపన్నపేట,నవంబర్,17,మెదక్ టుడే న్యూస్:
మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు
అందాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో పాపన్నపేట మండలం చికోడు గ్రామంలో ,20 లక్షల నాగ్సన్ పల్లి గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగానిర్మాణం పూర్తి చేసుకున్న 02 పశువైద్యశాల భవనాలు సోమవారంప్రారంభించారు. నియోజకవర్గంలో పశు వైద్య భవనాలను నిర్మించడంతోపాటు అన్ని వసతులు కల్పించి పశుపక్షాదులకు డాక్టర్లు సిబ్బంది అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పశు పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య,పంచాయతీరాజ్ డి.ఇ పాండురంగారావు, ఎంపీడీవో విష్ణువర్ధన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంత్ రెడ్డి,గోవింద నాయక్,ఆకుల శ్రీనివాస్,గౌస్,శ్రీకాంత్ అప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులుతదితరులు పాల్గొన్నారు.

