పసికందును అమ్మేసిన నర్సు.

-తల్లిని మోసం చేసి రూ.లక్షన్నరలకు నవజాత శిశువు విక్రయం -మెదక్ జిల్లాలో అమానుష ఘటన కలకలం -ఐదు రోజుల తర్వాత బతికే ఉందన్న విషయం తెలుసుకున్న తల్లి మెదక్,మే-6,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి):మెదక్ జిల్లాలో మానవత్వానికే మచ్చ తెచ్చే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టిన పసికందు చనిపోయిందని ఓ తల్లిని నమ్మించిన నర్సు, ఆ నవజాత శిశువును రహస్యంగా రూ.1.50 లక్షలకు విక్రయించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ అమానుష ఘటన బయటపడటంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.పోలీసులు తెలిపిన వివరాల...