పారిశుద్ధ్య కార్మికులే సమాజానికి నిజమైన సేవకులు-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాపురం నరసింహారెడ్డి.

పటాన్‌చెరు,జూన్,14,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం ఎండనక, వాననక నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి నిజమైన సేవకులని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాపురం నరసింహారెడ్డి కొనియాడారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని ముత్తంగి డివిజన్ (265) పరిధిలోని వెలిమల, సందుగూడెం, వెలిమల తండా ప్రాంతాలకు చెందిన జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల కోసం ఆదివారం ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శాపురం నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అత్యంత...