పార్టీలకతీతంగా తెల్లాపూర్‌లో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు:ఐక్యతను చాటిన గ్రామస్తులు.

రామచంద్రపురం,ఫిబ్రవరి,19,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధిలోని తెల్లాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు సరికొత్త చరిత్రను సృష్టించాయి. శివాజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో రాజకీయ రంగులు పక్కనపెట్టి, పార్టీలకతీతంగా గ్రామ పెద్దలు, యువకులు మరియు వివిధ పార్టీల నాయకులు ఒకే తాటిపైకి వచ్చి ఐక్యతను చాటారు. •ఒకే వేదికపై అన్ని పార్టీల నాయకులు. శివాజీ మహారాజ్ విగ్రహం లేదా చిత్రపటానికి పూలమాలలు వేసే క్రమంలో ఏ ఒక్క పార్టీ జెండా కనిపించకుండా, కేవలం 'కేసరి' జెండాల నీడన అందరూ...