MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 11:59 am Digital Edition : SHIVA KUMAR

పార్టీలకతీతంగా తెల్లాపూర్‌లో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు:ఐక్యతను చాటిన గ్రామస్తులు.

రామచంద్రపురం,ఫిబ్రవరి,19,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధిలోని తెల్లాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు సరికొత్త చరిత్రను సృష్టించాయి. శివాజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో రాజకీయ రంగులు పక్కనపెట్టి, పార్టీలకతీతంగా గ్రామ పెద్దలు, యువకులు మరియు వివిధ పార్టీల నాయకులు ఒకే తాటిపైకి వచ్చి ఐక్యతను చాటారు.

ఒకే వేదికపై అన్ని పార్టీల నాయకులు.

శివాజీ మహారాజ్ విగ్రహం లేదా చిత్రపటానికి పూలమాలలు వేసే క్రమంలో ఏ ఒక్క పార్టీ జెండా కనిపించకుండా, కేవలం ‘కేసరి’ జెండాల నీడన అందరూ ఒక్కటయ్యారు. “మహారాజ్ ఏ ఒక్క కులానికో, వర్గానికో చెందినవారు కాదు.. ఆయన భారతజాతి గర్వించదగ్గ వీరుడు” అంటూ నాయకులు స్పష్టం చేశారు. పరస్పర రాజకీయ విమర్శలకు తావు లేకుండా, కేవలం శివాజీ మహారాజ్ ఆశయాల గురించి చర్చిస్తూ వేడుకలను అత్యంత పవిత్రంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మరియు వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ:ఐక్యమత్యమే బలం: “రాజకీయాల్లో మా మధ్య విబేధాలు ఉండవచ్చు, కానీ గ్రామ అభివృద్ధికి మరియు శివాజీ మహారాజ్ వంటి మహాపురుషుల విషయంలో మేమంతా ఒక్కటే” అని చాటిచెప్పారు.
యువతకు మార్గదర్శకం: శివాజీ యూత్ సభ్యులు పార్టీల గోడలు దాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తి గ్రామంలో ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.స్వరాజ్య స్ఫూర్తి: శివాజీ మహారాజ్ స్థాపించిన స్వరాజ్యంలో అందరూ సమానమేనని, ఆ స్ఫూర్తితోనే తెల్లాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

శివాజీ యూత్ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు.

శివాజీ యూత్ ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామంలోని యువతను ఐక్యం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మధ్యాహ్నం గ్రామంలో నిర్వహించిన భారీ ర్యాలీలో యువకులు కత్తులు పట్టుకుని, శివాజీ వేషధారణలో చేసిన ప్రదర్శనలు పౌరుషాన్ని రగిలించాయి. గ్రామంలోని ప్రతి వీధి జై శివాజీ నినాదాలతో మారుమోగింది.ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ గ్రామానికి చెందిన అన్నీ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో యువకులు మరియు మహిళలు పాల్గొని విజయవంతం చేశారు.