పాపన్నపేటలో దోమల దండయాత్ర..విషజ్వరాలతో ప్రజలు విలవిల!

వర్షాకాలంలో పెరిగిన పారిశుధ్య సమస్యలు.. నిలిచిన వర్షపు నీరు, పిచ్చిమొక్కలతో దోమలకు ఆవాసాలు పాపన్నపేట,ఆగస్టు,30, మెదక్ టుడే న్యూస్:వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి పాపన్నపేట గ్రామంలో దోమల బెడద తీవ్రంగా పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో పాటు పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోయి పారిశుధ్య సమస్యలు నెలకొన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందడంతో పలువురు గ్రామస్తులు జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి...