MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 10:16 am Digital Edition : SHIVA KUMAR

పాపన్నపేటలో ఘనంగా హనుమాన్  ఆలయ వార్షికోత్సవం.

పాపన్నపేట,ఫిబ్రవరి,5,మెదక్ టుడే న్యూస్:మండల కేంద్రం పాపన్నపేట లోని మర్రి చెట్టు ప్రాంగణం లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని సుందరంగా బంతి పూలతో అలంకరించారు. గణపతి పూజ,సింధూరం విశేష పూజల అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు తదితరులు ఉన్నారు.