పదవ తరగతి ఫలితాల్లో సుంకు పావకి అద్భుత ప్రతిభశ్రీ వాణి విద్యా నికేతన్ పాఠశాలలో ప్రథమ స్థానం.

రామచంద్రాపురం,ఏప్రిల్,29,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి,ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో రామచంద్రాపురం నివాసి సుంకు పావకి విశిష్ట ప్రతిభ కనబరిచింది. రామచంద్రాపురంలోని పాత ఎం.ఐ.జి లో గల శ్రీ వాణి విద్యా నికేతన్ పాఠశాలలో చదువుతున్న ఈమె, 94.6 శాతం మార్కులతో 'ఏ-1' గ్రేడ్ సాధించి పాఠశాల స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.రామచంద్రాపురం వాసులైన శ్రీ సుంకు హరిబాబు, శ్రీమతి సుంకు లావణ్య దంపతుల కుమార్తె అయిన పావకి, తన క్రమశిక్షణ మరియు పట్టుదలతో ఈ ఘనత సాధించి తల్లిదండ్రులకు,పాఠశాలకు మరియు ఈ ప్రాంతానికి ఎనలేని...