MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 3:29 pm Digital Edition : Medak Today

పదవ తరగతి పరీక్షలకు రామచంద్రపురం సిద్ధం: ఎంఈఓ రాములు.

మండల వ్యాప్తంగా 7 పరీక్షా కేంద్రాలు.. 1643 మంది విద్యార్థులు హాజరు

విద్యార్థులకు కీలక సూచనలు జారీ చేసిన ఎంఈఓ

    రామచంద్రపురం,మార్చి,13,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రపురం మండల పరిధిలోరేపటి నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి శ్రీ రాములు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆయన కోరారు.

    1 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,బిహెచ్‌ఈఎల్

    2 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రామచంద్రపురం

    3 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తెల్లాపూర్

    4 స్కాలర్స్ మోడల్ హైస్కూల్

    5 సెయింట్ ఆర్నాల్డ్స్ హైస్కూల్

    6 సెయింట్ ఆన్స్ హైస్కూల్

    7 విద్యాభారతి హైస్కూల్ , బిహెచ్‌ఈఎల్

    విద్యార్థులకు ఎంఈఓ రాములు సూచనలు:

    సమయపాలన: పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయి. విద్యార్థులు గంట ముందే (8:30 గంటలకే) పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.నిషేధిత వస్తువులు: ఎగ్జామ్ హాల్లోకి సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, స్మార్ట్ వాచ్‌లు లేదా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదు.
    వసతులు: ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తాగునీరు, విద్యుత్ మరియు ఫర్నిచర్ వంటి కనీస వసతులు కల్పించామని, విద్యార్థులు తమ హాల్ టికెట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు.క్రమశిక్షణ: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఇన్విజిలేటర్ల నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు.విద్యార్థులందరూ కష్టపడి చదివి, మంచి ఫలితాలు సాధించి మండలానికి పేరు తీసుకురావాలని ఎంఈఓ రాములు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.