పాత రామచంద్రపురంలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం-అధికారుల సమన్వయంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు.
రామచంద్రపురం,జూన్,1,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.పాత రామచంద్రపురం జాతీయ రహదారి పక్కన నెలకొన్న డ్రైనేజీ సమస్యకు అధికారుల సమన్వయంతో శాశ్వత పరిష్కారం లభించింది. డ్రైనేజీ వ్యవస్థ స్తంభించడంతో గత కొంతకాలంగా మూడవ వార్డు ప్రజలు మురికినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ మూసుకుపోవడంతో నాలాలోని నీరు బయటకు పొంగి ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఆందోళన చెందారు.ఈ సమస్యపై స్థానిక ప్రజలు బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు సుంకు వినయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశారు....