MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 1:00 am Digital Edition : Shiva Kumar

పాము కాటుతో బాలుడు మృతి.

కొల్చారం,మే,24,మెదక్ టుడే న్యూస్:పాము కాటుతో బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని వరిగుంతం గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దండు సుజిత్ కుమారుడు దండు సతీష్ (7) శనివారం రాత్రి ఇంటి ముందు తన తాత మా అన్నయ్యతో కలిసి ఇంటి ముందు వాకిట్లో నిద్రించాడు. కాగా అర్ధరాత్రి సమయంలో బాలుని చేతి వేలుకు ఏదో కుట్టినట్లు అనిపించగా వెంటనే లేచి తండ్రికి తెలిపాడు. బాలుని తండ్రి సుజిత్ కుమారుని చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా హాస్పిటల్ తరలించాడు. రాత్రి అక్కడ చికిత్స తీసుకుని, ఆదివారం మెదక్ ఎం సి హెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం బాలుడు మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని తర్యాప్తు చేపట్టారు.