పటిష్ట.బందోబస్తు అమలు.మెదక్ జిల్లా ఎస్ పి శ్రీనివాస రావు..
పాపన్నపేట,డిసెంబర్,10,న్యూస్:గురువారం జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పాక్షపాతంగా నిర్వహించేందుకు మెదక్ జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు వెల్లడించారు. ఎన్నికల పోలింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా,పూర్తిస్థాయి భద్రతా ప్రణాళికను రూపొందించి పటిష్ట బందోబస్తు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం పాపన్నపేట జడ్పీ పాఠశాల మైదానంలో పోలీస్ స్టేషన్‌లో పోలింగ్ బందోబస్తు,రూట్ మొబైల్ బందోబస్తు,పోలింగ్ స్టేషన్ భద్రత,సెక్టార్ మొబైల్,స్ట్రైకింగ్ ఫోర్స్ వంటి విభాగాల సిబ్బందికీ ప్రత్యేక...