పటాన్‌చెరులో పదవ తరగతి పరీక్షలకు సిద్ధం:ఎంఈఓ.
•మండల వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాల ఏర్పాటు •3196 మంది విద్యార్థులు హాజరు.. పకడ్బందీగా సీసీ కెమెరాల నిఘా. • పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. పటాన్‌చెరు,మార్చి,12(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలో ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షల నిర్వహణపై మండల విద్యాధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని...