MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 11:57 pm Digital Edition : Medak Today

పటాన్‌చెరులో పదవ తరగతి పరీక్షలకు సిద్ధం:ఎంఈఓ.

•మండల వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాల ఏర్పాటు

•3196 మంది విద్యార్థులు హాజరు.. పకడ్బందీగా సీసీ కెమెరాల నిఘా.

• పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.

    పటాన్‌చెరు,మార్చి,12(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలో ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షల నిర్వహణపై మండల విద్యాధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.

    పరీక్షల గణాంకాలు:

    ఈ ఏడాది పటాన్‌చెరు మండలంలో మొత్తం 3,196 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 1,746 మంది బాలురు, 1,450 మంది బాలికలు ఉన్నారు. వీరి కోసం మండల వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. ఈ కేంద్రాల పర్యవేక్షణ కోసం మొత్తం 175 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందని పేర్కొన్నారు.

    పకడ్బందీ ఏర్పాట్లు – ఎంఈఓ వెల్లడించిన వివరాలు:

    •సిసి కెమెరాల నిఘా: పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రతి ఎగ్జామ్ హాల్‌లో సీసీ కెమెరాలను అమర్చామని, వీటి ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

    •విద్యార్థుల సౌకర్యార్థం: ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తాగునీటి సదుపాయం, విద్యుత్ సరఫరా, మరియు మెరుగైన టాయిలెట్ సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు.

    •మెడికల్ క్యాంపులు: విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా ప్రతి సెంటర్ వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశామని, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

    • 144 సెక్షన్ అమలు: పోలీస్ శాఖ సహకారంతో పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లను పరీక్ష సమయంలో మూసివేయాలని ఆదేశించారు.

    ముఖ్య సూచన:

    విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు పరీక్షా హాల్లోకి అనుమతించబడవు అని ఎంఈఓ నాగేశ్వరరావు గారు హెచ్చరించారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో పరీక్షలు రాసి మండల కీర్తిని చాటాలని ఆయన ఆకాంక్షించారు.

    పటాన్‌చెరు మండల పరీక్షా కేంద్రాల వివరాలు:

    1.జెడ్ . పి బాయ్స్ హైస్కూల్, పటాన్‌చెరు (240)

    1. జెడ్ . పి గర్ల్స్ హైస్కూల్, పటాన్‌చెరు (240)
      3.సెయింట్ జోసెఫ్ హైస్కూల్ ‘A’ సెంటర్ (240)
      4.సెయింట్ జోసెఫ్ హైస్కూల్ ‘B’ సెంటర్ (240)
      5.జెడ్ . పి హైస్కూల్ ఇస్నాపూర్ (240)
      6.సెయింట్ మేరీస్ గ్రామర్ హైస్కూల్, ఇస్నాపూర్ (240)
      7.శిశు విహార్ హైస్కూల్, శాంతినగర్ (240)
      8.వి ఎస్ ఆర్ స్కూల్, పటాన్‌చెరు (240)
      9.ఒరిజన్ టెక్నో స్కూల్, గౌతమ్ నగర్ (219)
      10.శ్రీ చైతన్య హైస్కూల్, పటాన్‌చెరు (220)
      11.మంజీరా హైస్కూల్, పటాన్‌చెరు (220)
      12.గౌతమ్ హైస్కూల్, ఇంద్రేషం (220)
      13.శాంతి నికేతన్ హైస్కూల్, పటాన్‌చెరు (188)
    2. జెడ్ పి హైస్కూల్ ముత్తంగి (209)..

    (మొత్తం విద్యార్థులు 3196..)