నియమ నిబంధనలతోనే వినాయక చవితి వేడుకలు-డీజేలకు పూర్తి నిషేధం.ఒక్క స్పీకర్‌కే అనుమతి.

మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తప్పనిసరి పటాన్‌చెరు సీఐ రవీందర్ స్పష్టీకరణ పటాన్‌చెరు, సెప్టెంబర్,1:(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి.గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పటాన్‌చెరు సీఐ రవీందర్ నిర్వాహకులకు పిలుపునిచ్చారు. రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం పటాన్‌చెరు లో ముదిరాజ్ సంఘం భవనంలో మండపాల నిర్వాహకులతో శాంతిభద్రతల సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పటాన్‌చెరు పరిధిలో గత ఏడాది 495 మండపాలు ఏర్పాటు చేశారని, ఈ ఏడాది...