MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 3:22 pm Digital Edition : Medak Today

నిరుపేదల ఆరోగ్యమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి: బండారి రమేష్-అంబేద్కర్ జయంతి సందర్భంగా షాద్నగర్ అంబేద్కర్ కాలనీలో వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న విశ్వహిందూ పరిషత్..

(స్పెషల్ కరస్పాండెంట్):షాద్‌నగర్,ఏప్రిల్,15,మెదక్ టుడే న్యూస్:నిరుపేదల ఆరోగ్య పరిరక్షణే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కి నిజమైన నివాళి అని విశ్వహిందూ పరిషత్ ఆంధ్ర–తెలంగాణ క్షేత్ర సేవా ప్రముఖ్ బండారి రమేష్ అన్నారు.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, షాద్‌నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో విశ్వహిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈసందర్భంగా శిబిరానికి హాజరైన నిరుపేదలకు ప్రముఖ వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు బండారి రమేష్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో మఠమందిర ప్రాంత సహ ప్రముఖ్ మఠం రాజయ్య, భాగ్యవతి, జిల్లా సేవా ప్రముఖ్ వెంపటి నాగేశ్వర్, పట్టణ అధ్యక్షుడు రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
వైద్య శిబిరంలో డా. శివానంద్, డా. కార్తికేయ, డా. మల్లిక, డా. బుచ్చయ్య, డా. వెంకటేష్, డా. తిరుపతి, డా. ఆంజనేయులు, డా. పద్మనాభం తదితరులు సేవలందించారు.