నీలం బిక్షపతి ఆధ్వర్యంలో అమీన్‌పూర్ ‘మినీ మేడారం’లో ఘనంగా ‘ఒడిబియ్యం’ సమర్పణ- అన్నదానం.

అమీన్‌పూర్,ఫిబ్రవరి,20,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్‌లో మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క–సారలమ్మ దేవాలయంలో, ఆలయ చైర్మన్ నీలం బిక్షపతి ఆధ్వర్యంలో అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పణ మరియు అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మేడారం మహా జాతర ముగిసిన అనంతరం ప్రతి ఏటా నిర్వహించే సంప్రదాయం ప్రకారం, ఈ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ నీలం బిక్షపతి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు....