MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 12:36 am Digital Edition : Medak Today

నేతాజీ నగర్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

పటాన్ చెరు,మార్చి,10,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు ఐక్యతకు ప్రతీకలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జేపీ కాలనీ డివిజన్ పరిధిలోనిబండల్‌గూడ నేతాజీనగర్ ఖాజా గారిబే నవాజ్ మసీద్ నందు మంగళవారం సాయంత్రం మాజీ ఎంపీపీ నాలకంటి యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈనెల 13వ తేదీన పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందును విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నాగ మల్లేష్ యాదవ్, చంద్రశేఖర్, జబ్బర్, షాబుద్దీన్ , అక్రమ్, యాసిన్, సోహియల్, గోరి, పద్మ, మేరీ, తదితరులు పాల్గొన్నారు.