నీట్ పరీక్షల విశ్వసనీయతపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి.

విద్యార్థుల ఆందోళనలపై బలప్రయోగం తగదు: తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి (స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,జులై,21,మెదక్ టుడే న్యూస్:నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత వహించి, దేశ ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలని కేశంపేట మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఇలాంటి ఘటనలపై పారదర్శక విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసుల...