నార్సింగి–పెద్ద శంకరంపేట రహదారి,రోడ్డెక్కాలంటేనే భయం!
నార్సింగి–పెద్ద శంకరంపేట రహదారి అధ్వానంగా.. నరకయాతన అనుభవిస్తున్న ప్రజలు వర్షం పడితే గుంతల్లో నీరు.. చిత్తడిగా మారుతున్న రోడ్డు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం, మెదక్ టుడే న్యూస్ జులై 22 మెదక్ జిల్లారిపోర్టార్ పి. దుర్గేష్ గౌడ్ పాపన్నపేట మండలం నార్సింగి నుంచి పెద్ద శంకరంపేట వైపు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై అడుగడుగునా గుంతలు ఏర్పడి ఉండటంతో వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షం కురిసిన సమయంలో గుంతల్లో...