నల్ల పోచమ్మ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్.

అమీన్‌పూర్,ఏప్రిల్,12,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలో బీరంగూడ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో వెలసిన శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని...