అమీన్‌పూర్,ఏప్రిల్,12,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలో బీరంగూడ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో వెలసిన శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు నందారం నరసింహా గౌడ్ ని శాలువాతో కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర కాలనీ కో-ఆపరేటివ్ సొసైటి ప్రెసిడెంట్ ఎం మల్లేష్ , శ్రీ నల్ల పోచమ్మ ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
