ముగిసిన అమీన్‌పూర్ ‘మినీ మేడారం’ జాతర: ఘనంగా అమ్మవార్ల వన ప్రవేశం
8 లక్షల మంది భక్తుల రాకతో పులకించిన అమీన్‌పూర్ - సమ్మక్క-సారక్కల ఆశీస్సులు అందరిపై ఉండాలి: ఆలయ చైర్మన్ నీలం బిక్షపతి అమీన్‌పూర్,జనవరి,31,(మెదక్ టుడే) న్యూస్,ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలో 'మినీ మేడారం'గా ప్రసిద్ధి చెందిన సమ్మక్క-సారలమ్మ జాతర శనివారం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ముగిసింది. నాలుగు రోజుల పాటు కన్నుల పండుగగా జరిగిన ఈ జాతరలో చివరి రోజైన నేడు అమ్మవార్లను వన ప్రవేశం చేయించడంతో జాతర వేడుకలు ముగిశాయని ఆలయ కమిటీ చైర్మన్ నీలం బిక్షపతి...