మొహర్రం వేడుకల్లో సందడి చేసిన ప్రజాప్రతినిధులుపీర్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు.సామరస్యానికి ప్రతీకగా మొహర్రం పండుగ,అగ్గనూర్ బసవేశ్వర్.

(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,జూన్,26,మెదక్ టుడే న్యూస్:మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫరూక్‌నగర్ పట్టణం ముదిరాజ్ కాలనీలో శుక్రవారం నిర్వహించిన పీర్ల ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్ పాల్గొని పీర్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ మాట్లాడుతూ, మొహర్రం పండుగ మత సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని...