MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 3:06 am Digital Edition : Shiva Kumar

మొహర్రం వేడుకల్లో సందడి చేసిన ప్రజాప్రతినిధులుపీర్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు.సామరస్యానికి ప్రతీకగా మొహర్రం పండుగ,అగ్గనూర్ బసవేశ్వర్.

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,జూన్,26,మెదక్ టుడే న్యూస్:
మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫరూక్‌నగర్ పట్టణం ముదిరాజ్ కాలనీలో శుక్రవారం నిర్వహించిన పీర్ల ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్ పాల్గొని పీర్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ మాట్లాడుతూ, మొహర్రం పండుగ మత సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు కలిసి పీర్ల వేడుకల్లో పాల్గొనడం రాష్ట్ర సంస్కృతిలోని విశిష్టతను ప్రతిబింబిస్తోందని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలు సమాజంలో ఐక్యతను, పరస్పర గౌరవాన్ని మరింత బలోపేతం చేస్తాయని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మురళీమోహన్ (అప్పి), ముబారక్ అలీ ఖాన్, మహమ్మద్ ఇబ్రహీం, మహమూద్, అశోక్, బీరప్ప, సాయి కుమార్‌తో పాటు స్థానిక ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.