ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు,బీ ఆర్ఎస్ నాయకులు ఆగ్రహం.
చేగుంట,మే,23,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో శనివారం బీఆర్‌ఎస్ (బిఆర్ఎస్) పార్టీ ముఖ్య నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ మరియు సీనియర్ నాయకుడు సోమ సత్యనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఆ పార్టీ స్థానిక నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ ఉనికి కోసం కొందరు కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎమ్మెల్యే కాలి గోటికి కూడా సరిపోని వారికి ఆయనను విమర్శించే...