ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి ఆశీస్సులు తీసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఐలాపూర్ నర్సింగ్ రావు

అమీన్ పూర్,ఆగస్టు,14,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఐలాపూర్ నర్సింగ్ రావు తన జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని, అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డిని, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ నీ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఐలాపూర్ నర్సింగ్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ అడుగుజాడల్లోనే నడుస్తానని, వారు ఏ విధంగా సూచిస్తే ఆ మార్గంలో పార్టీ బలోపేతం కోసం ఎల్లవేళలా సైనికుడిలా పని చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్, హరీష్ రావు , కేటీఆర్ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.తన పుట్టినరోజును పురస్కరించుకొని నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు అందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొల్లూరు మల్లేష్, చంద్రశేఖర్, కొల్లూరి గోపాల్, పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని నర్సింగ్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
