మెదక్ పట్టణ నూతన మాస్టర్ ప్లాన్ అమలుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలి.
మెదక్,జూలై,17(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) మెదక్ పట్టణ అభివృద్ధికి అత్యంత కీలకమైన నూతన మాస్టర్ ప్లాన్‌ను తక్షణమే అమలు చేయాలని మెదక్ పట్టణ టీఆర్ఎస్ కన్వీనర్, 5వ వార్డు కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు దాదాపు 40 సంవత్సరాల క్రితం రూపొందించిన పాత మాస్టర్ ప్లాన్‌ల స్థానంలో నూతన మాస్టర్ ప్లాన్‌లు రూపొందించే ప్రక్రియలో భాగంగా, గత పాలకవర్గం మెదక్ పట్టణానికి సంబంధించిన సమగ్ర సర్వేలను పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, ఎన్నికల కోడ్...