MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 4:11 am Digital Edition : Shiva Kumar

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాపురం నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

పటాన్ చెరు,జులై,23,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాపురం నరసింహారెడ్డి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముత్తంగి విభాగం పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్టీ కార్యక్రమాలు, ప్రజల సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. అలాగే, ముత్తంగి విభాగంలో శాపురం నరసింహారెడ్డి చేపడుతున్న ప్రజాసేవా కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్యంగా, పారిశుద్ధ్య కార్మికుల సన్మానం, ప్రత్యేక పనుల పర్యవేక్షణ, ప్రజలతో ప్రత్యక్ష సమావేశాలు, సామాజిక సేవా కార్యక్రమాలు మరియు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం కోసం తీసుకుంటున్న చర్యలను నీలం మధు ముదిరాజ్‌కు తెలియజేశారు.
శాపురం నరసింహారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను నీలం మధు ముదిరాజ్ అభినందించారు. ఇదే సేవా స్ఫూర్తితో ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండాలని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఆయనకు సూచించారు.