మెదక్ పట్టణంలోని సాయి దత్తా సినిమా థియేటర్ సమీపంలో కొనసాగుతున్న వంతెన నిర్మాణం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ప్రజల నుంచి వస్తున్న ఆందోళనను తాను గమనించినట్లు ఎమ్మెల్యే మినంపల్లి రోహిత్ అన్న తెలిపారు.

మెదక్,డిసెంబర్,22,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,మెదక్ పట్టణంలోని సాయి దత్తా సినిమా థియేటర్ సమీపంలో కొనసాగుతున్న వంతెన నిర్మాణం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ప్రజల నుంచి వస్తున్న ఆందోళనను తాను గమనించినట్లు ఎమ్మెల్యే మినంపల్లి రోహిత్ అన్న తెలిపారు.ఈప్రాంతంలో సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు.ఈవిషయంపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ శాఖ మరియు పోలీసు అధికారులతో తక్షణమే సమావేశం నిర్వహించి, సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వంతెన నిర్మాణ ప్రాంతంలో తగిన భద్రతా సూచికలు,...